Hitler gari pellam written update | హిట్లర్ గారి పెళ్ళాం 19 జూన్ 2021 పూర్తి ఎపిసోడ్ కథ.
హిట్లర్ గారి పెళ్ళాం డైలీ సీరియల్ జూన్ 19వ తారీకు కధ భాను మెట్లు దిగీరావటం తో ప్రారంభం అవుతుంది. దక్ష, మాయ, చిత్ర అంచనాలు తారు మరు చేస్తూ హిట్లర్ హోమానికి సిద్ధమై భాను వెనుక క్రింద కు వస్తాడు. జయమ్మా హోమాన్ని ఆపవలసిన అవసరం లేదు వెంటనే ప్రారంభించామని పంతులు గారిని అడుగుతుంది.
అంతా సవ్యముగా జరుగుతుంది అనుకొంటున్నప్పుడు భాను ఫోన్ కి ఒక షొక్కింగ్ మెసేజ్ వస్తుంది. మెసేజ్ చదివిన భాను దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయి చేతిలో వున్నా నవధాన్యాలు పళ్లెం జరా విడుస్తుంది. అవకాశం కోసం గోతి దగ్గర నక్కలు ల ఎదురు చూసే ముగ్గురు కోడళ్ళు ఒకరి తరువాత ఒకరు వెటకారంగా, వ్యంగముగా, కీడు శంకించేలా, జయమ్మను భయపెట్టే విధముగా దక్ష సైగ ఫై భాను ఫై దాడి ని ప్రారంభిస్తారు.
కోడళ్ల ఎదురు దాడి ని పంతులు గారు ఒక చిత్రమైన పోలిక ఆలోచనతో ఎటువంటి కీడు లేదు కాకరకాయ లేదు అంత మంచిదే అని భాను ని వేనేకేసుకు వచ్చి ఎలాగోలా రక్షిస్తారు . కానీ
మెసేజ్ లో కంటెంట్ గురి చేసిన షాక్ నుంచి తేరుకొని భాను మనిషి ఇక్కడ ఆలోచన ఎక్కడో ఉంచి తూ తూ మంత్రముగా హోమాన్ని హిట్లర్ తో ముగుంచి ప్రక్క కు వస్తుంది.
నెక్స్ట్ సీనులో అంజలి తన అక్క విజయాన్ని బదరి భార్యతో పంచుకుంటుంది. ఉన్నట్టుండి రూంలోకి వఛ్చిన భాను తనకు వఛ్చిన మెసేజ్ ని అంజలి, సింధు కి చూపిస్తుంది. ముగ్గురు తమ రహస్యము నాలుగవ మనిషి తెలిసింది ఎలా ఏమి చెయ్యాలి అని తర్జన భర్జన పాడుతారు. విషయము తీవ్రమౌతోంది. అంజలి తన వల్ల అక్క, సింధు ఇరుక్కో కూడదు. ఈ సమస్య నుంచి అందరిని బావగారు మాత్రమే రక్షించ గలరు పదండి నిజము చెప్పేద్దాము అని వత్తిడి చేస్తుంది. వారి మద్య తీవ్రమైన పెనుగులాట జరుగుతుంది.
అంజలి అక్కను, సింధుని ప్రక్క కు తోసి తలుపు తహెసుకొని బావ హిట్లర్ వద్దకు పరుగు తీస్తుంది. బావతో తాను ఒక తప్పు చేసానని, తప్పు కొనసాగిస్తున్నాను అని చెపుతుంది. అంజలి ముఖము లో భయము, ఆందోళన ని హిట్లర్ గమనిస్తాడు. భయపడకుండా తనతో మొత్తము చెప్పేయమంటాడు.
ఆంజలి అటు తిప్పి ఇటు తిప్పి విషయము తెరిచే లోపు భాను వచ్చి బావ తో చెప్పేంత విషయము కాదు మనము చేసుకుందాము రా అని లాగుతుంది. హిట్లర్ భాను ని ఆగమంటాడు. భాను తనపై ఒట్టు తో అంజలి నోరు మూయిస్తుంది. టాపిక్ ని దారి మళ్లిస్తూ భాను కి అంజలి జాబ్ గురుంచి అంటూ అబద్ధము చెబుతుంది. అంజలి తనతో బయటకు లాక్కొని వస్తుండగా హిట్లర్ వాళ్ళని ఒక నిముషము ఆగమంటాడు.
మీరు ఈ కథనాన్ని ఇష్టపడితే మరియు నా ప్రయత్నం దయచేసి నిమిషం తీసుకొని ఈ పోస్ట్‌ను మీ సోషల్ మీడియా, ఫేస్‌బుక్, వాట్సాప్ ఫీడ్‌లలో పంచుకోవడం ద్వారా నన్ను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహం నన్ను కూడా ప్రేరేపిస్తుంది. ధన్యవాదాలు.